Wednesday, January 22, 2025

వన్ అండ్ ఓన్లీ సోగ్గాడు నాగార్జున

- Advertisement -
- Advertisement -

Nagarjuna said about Bangarraju

 

కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం బంగార్రాజు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా ఏర్పాటైన ఈవెంట్‌లో నాగార్జున మాట్లాడుతూ.. “ఇంత అద్భుతమైన స్క్రిప్ట్ ఇచ్చిన కళ్యాణ్‌కి థ్యాంక్స్. నవ్వుతూనే అందరితో పని చేయించుకున్నాడు. కృతిశెట్టి అద్భుతంగా నటించింది. కొత్త నాగచైతన్యను ఈ సినిమాలో చూస్తారు”అని అన్నారు. నాగ చైతన్య మాట్లాడుతూ.. “ఇది నిజంగానే పండుగలాంటి సినిమా. అందుకే ఈ సినిమాను నాన్న డిజైన్ చేశారు” అని తెలిపారు. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ.. “వన్ అండ్ ఓన్లీ సోగ్గాడు నాగార్జున. బంగార్రాజు పాత్ర ఆయన కోసమే పుట్టింది. నాగచైతన్య అద్భుతంగా నటించాడు. రమ్యకృష్ణ అద్భుతమైన నటి. కృతికి ఇది మూడో సినిమానే. వందశాతం కష్టపడి చేసింది” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ప్రసాద్, అనూప్ రూబెన్స్, రామ్‌లక్ష్మణ్, అనసూయ భరద్వాజ్, దక్ష నగర్కార్, దర్శన, విజయ్, జునైద్, యువరాజ్ పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News