Sunday, December 22, 2024

పండక్కి కిష్టయ్య వస్తున్నాడు.. బాక్సాఫీస్ కొడుతున్నాడు: నాగార్జున

- Advertisement -
- Advertisement -

కింగ్ నాగార్జున అక్కినేని హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘నా సామిరంగ’. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి అందించిన పాటలు చార్ట్ బస్టర్ గా అలరిస్తున్నాయి. ఈ చిత్రంలో ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. అల్లరి నరేష్, రాజ్ తరుణ్, రుక్సర్ ధిల్లాన్, మిర్నా మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి హై బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. నా సామిరంగ సంక్రాంతి కానుకగా జనవరి14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదల కానుంది. ఈ నేపధ్యంలో ‘నా సామిరంగ’ ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.

ప్రీరిలీజ్ ఈవెంట్ లో కింగ్ అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. అక్కినేని అభిమానులకు నమస్కారం. సంక్రాంతి అంటే సినిమా పండగ. టీవీలు వచ్చినపుడు సినిమాలు ఇంక చూడరని అన్నారు. తర్వాత ఫోన్లు వచ్చాయి చూడరని అన్నారు. డీవీడీలు, డిజిటల్ వచ్చిన తర్వాత చూడరని అన్నారు. కానీ ప్రేక్షకులు సినిమాలు చూస్తూనే వున్నారు. ఓటీటీ వచ్చిన తర్వాత చూడరు అన్నారు. కానీ చూస్తూనే వున్నారు. కోవిడ్ తర్వాత కూడా సినిమాలు చూస్తూనే వున్నారు.

 

పండగ రోజున సినిమా చూడటం అనేది ఆనవాయితీ. నాలుగు సినిమాలు వచ్చినా చూస్తారు. మన తెలుగువారికి సంక్రాంతి అంటే సినిమా పండగ. ఈ సంక్రాంతి నాలుగు సినిమాలు వస్తున్నాయి. పరిశ్రమలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని ‘గుంటూరుకారం’తో వస్తున్న మహేష్ బాబుకి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను. బాల నటుడిగా తేజని చూశాను. ఇప్పుడు తను హీరోగా హను-మాన్ అనే సినిమాతో వస్తున్నాడు. తనకి ఆల్ ది బెస్ట్. మా వెంకీ 75వ చిత్రంగా సైంధవ్ తో వస్తున్నారు. తనకి ఆల్ ది బెస్ట్. మేము ‘నా సామిరంగ’తో వస్తున్నాం. మేము ఇచ్చే సినిమా మీకు నచ్చితే ఎంత ఆదరిస్తారో అలా రెండు పండగలు చూశాం. మీకు సినిమా నచ్చుతుంది.

ఈ పండక్కి కూడా అలానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మా సినిమాకి స్టార్ కీరవాణి గారు. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పాటలు ఇచ్చారు. ఈ సినిమాని మూడు నెలల్లో పూర్తి చేశామంటే ఆయన మా వెనుక వుండి ముందుకు నడిపించారు. సినిమా స్టార్ట్ అవ్వకముందే మూడు పాటలు, ఒక యాక్షన్ సీక్వెన్స్ కి నేపధ్య సంగీతం చేసి మా ముందు పెట్టారు. కీరవాణి గారు లాంటి టెక్నిషియన్ వుంటే ఏదైనా సాధిస్తాం. కొత్త దర్శకుడు విజయ్ బిన్నీ వెన్నుతట్టి ఆయన వెనుక వుండి కీరవాణి గారు, చంద్రబోస్ గారు ప్రోత్సహించారు. మూడు నెలలు పాటు టీం అంత ఒక ఫ్యామిలీలా వుండి ఈ సినిమా తీశాం. మూడు నెలల్లో సినిమా తీయడం అంటే అంత ఈజీ కాదు. కానీ చేశాం.

ఈ కష్టం ఫలించిందా లేదా అనేది జనవరి 14న తెలుస్తుంది. సెప్టెంబర్ 20నాన్న గారి పుట్టిన రోజున ఆయనకి వందేళ్ళు వచ్చిన రోజున ఆయన విగ్రహం ఆవిష్కరించినపుడు ఆయనకి నమస్కరించుకునప్పుడు ఆయన నా మనసులో చెప్పిన మాట ‘వెళ్లి సినిమా చేయ్.. నా సామిరంగ’ అన్నారు. ఆయన చెప్పిన ధైర్యంతో సినిమాని పూర్తి చేశాం. ఈ టీం గురించి, వాళ్ళు పడిన కష్టం గురించి ఇప్పుడు చెప్పను.. సక్సెస్ మీట్ లో చెప్తాను. మూడు నెలల్లో సినిమా ఎలా తీయొచ్చు అనేది ఒక పుస్తకం కూడా రాసిస్తాం. సినిమా విడుదల సందర్భంగా అక్కినేని అభిమానులకు ఒక మాట చెప్పాలి. ఈసారి పండక్కి కిష్టయ్య వస్తున్నాడు.. బాక్సాఫీసు కొడుతున్నాడు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు’ తెలిపారు.

హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నాగార్జున గారికి నేను చిన్నప్పటి నుంచి ఫ్యాన్ బాయ్ ని. ఆయన్ని స్క్రీన్ మీద చూసి ఈలల వేసిన రోజుల నుంచి ఈ రోజు ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా వుంది. డైరెక్టర్ విజయ్ బిన్నీ గారు అనుకున్న సమయానికి అనుకున్నట్లుగా తీశారు. ఆయనకి హాట్సప్. నిర్మాతలు శ్రీనివాస్ గారికి, పవన్ గారికి థాంక్స్. అషిక, రుక్సర్, మిర్నా అందరూ చక్కగా నటించారు. మా టీంకి అండగా నిలుచున్న కీరవాణి గారు చంద్రబోస్ గారికి థాంక్స్’’ తెలిపారు

హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. డైరెక్టర్ విజయ్.. లవ్ యూ. నరేష్ బ్రో.. నా సోపతి నీ సొంతం అన్న. నా మొదటి సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ లో చేశాను. తర్వాత రంగాలరాట్నం, అనుభవించురాజా చేశాను. ఇప్పుడు నాగార్జున గారితో కలసి పని చేయడం చాలా ఆనందంగా వుంది. నాగార్జున గారికి ఎంత థాంక్స్ చెప్పిన సరిపోదు. కీరవాణి గారు సంగీతం అందించిన చిత్రంలో నేను భాగం కావడం నా అదృష్టం. అషిక, రుక్సర్, మిర్నా అందరికీ థాంక్స్. నిర్మాతలకు ధన్యవాదాలు. జనవరి 14న నా సామిరంగ వస్తుంది. ఈసారి పండక్కి అందరికీ పండగే. అక్కినేని ఫ్యాన్స్ థియేటర్స్ లో పండగ చేసుకుంటారు’’ అన్నారు.

డైరెక్టర్ విజయ్ బిన్నీ మాట్లాడుతూ..నా సామిరంగ చాలా రకాలు స్పెషల్ మూవీ. ఈ పండక్కి పండగలా వుంటుంది. నిర్మాత చిత్తూరి శ్రీనివాస్ గారు నాలాంటి ఒక కొత్త దర్శకుడిని ప్రోత్సహించారు. ఎప్పటికీ ఆయన్ని మర్చిపోలేను. పవన్ గారికి థాంక్స్. నా రైటర్స్ ప్రసన్న, థామస్ కి థాంక్స్. డీవోపీ శివన్న, ఆర్ట్ డైరెక్టర్ సత్యనారాయణ, ఎడిటర్ చోటాకే ప్రసాద్ గారు నా టెక్నికల్ టీం అందరికీ పేరుపేరునా థాంక్స్. ఎంఎం కీరవాణి గారు ఒక కొత్త దర్శకుడుకి ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేను. చంద్రబోస్ గారు చాలా అద్భుతమైన సాహిత్యం అందించారు. అషిక, మిర్నా. రుక్షర్ చక్కగా నటించారు. నేను డైరెక్షన్ చేస్తుంటే అందరికంటే హ్యాపీగా ఫీలయ్యేది రాజ్ తరుణ్. నరేష్ గారు బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అంజి అనే పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కింగ్ నాగార్జున గారు  నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తి. నన్ను దర్శకుడిని చేసిన రియల్ హీరో నాగార్జున గారు. నాగార్జున గారితో వున్న అనుబంధం ఎంతో ప్రత్యేకం. నాగార్జున గారికి పాదాభివందనం. లైఫ్ లాంగ్ నా ఫేవరేట్ హీరో, గుండెల్లో ఉండిపోయే హీరో కింగ్ నాగార్జున గారు. గ్లింప్స్ విడుదలైనప్పటి నుంచి అక్కినేని అభిమానాలు ఇస్తున్న సపోర్ట్ మర్చిపోలేను. వారందరికీ ధన్యవాదాలు. సినిమా చూడండి. ప్రోత్సహించండి. సినిమా బావుంటే నాగార్జున గారు నాలాంటి మరో పదిమంది కొత్త దర్శకులని పరిచయం చేస్తారు. అందరికీ ధన్యవాదాలు’’ తెలిపారు.

సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి మాట్లాడుతూ.. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. శివతో రామ్ గోపాల్ వర్మ, సీతారాముల కళ్యాణం చూతము రారండి తో వైవిఎస్ చౌదరి, ఇప్పుడు నా సామిరంగ తో విజయ్ బిన్నీ ..ఇలా కొత్త దర్శకులని, కొత్త టెక్నిషియన్స్ ని గుర్తించి ప్రోత్సహించే వారిలో ముందుండేది నాగార్జున గారు’’ అన్నారు.

చంద్రబోస్ మాట్లాడుతూ.. నాగార్జున గారికి ధన్యవాదాలు. 28 ఏళ్ళుగా నన్ను నా ప్రతిభని ప్రోత్సహిస్తూ తనతో పాటు నా ప్రతిభని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన కీరవాణి గారికి పాదాభివందనాలు. ఈ సినిమాలో నాలుగు మంచి పాటలు రాశాను. ఉత్తమమైన కవితా పంక్తులు రాశాను. ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుందే పాటలో సాహిత్యం మనసుని హత్తుకునేలా వుంటుంది. ఈ సినిమాలో పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమా ద్వారా మరింత ఎత్తు కెళ్ళిపోవాలని భావిస్తున్నాను’’ అన్నారు

అషిక రంగనాథ్ మాట్లాడుతూ.. నా సామిరంగ ని సంక్రాంతికే మీ ముందుకు తీసుకురావడానికి చాలా కష్టపడ్డాం. ఇందులో నా పాత్ర వరాలు చాలా స్పెషల్ క్యారెక్టర్. టీజర్, ట్రైలర్, పాటలకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. నాగార్జున గారితో పని చేయడం నా అదృష్టం. చాలా అద్భుతమైన వ్యక్తి. ఎంతగానో సపోర్ట్ చేశారు. నాగార్జున గారితో పని చేయడం మర్చిపోలేను. ఎంఎం కీరవాణి గారి సంగీతం అందిస్తున్న సినిమాలో నేను వుండటం మరో అదృష్టం. అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. వరాలు లాంటి మంచి పాత్రని ఇచ్చిన దర్శకుడు బిన్నీగారికి ధన్యవాదాలు.  శ్రీనివాస చిట్టూరి గారు , పవన్ గారు అద్భుతమైన నిర్మాతలు. చాలా గ్రాండ్ గా ఈ సినిమాని నిర్మించారు.  నరేష్ గారు, రాజ్ తరుణ్, మిర్నా, రుక్షర్ టీంలో అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. అందరూ జనవరి 14న సినిమా చూడాలి’’ అని కోరారు

రుక్షర్ ధిల్లాన్ మాట్లాడుతూ.. నా సామిరంగా చాలా స్పెషల్ మూవీ. ఇందులో కుమారి అనే క్యూట్ పాత్రలో కనిపిస్తాను. ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. కీరవాణి గారికి నేను పెద్ద ఫ్యాన్ ని. ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. రాజ్ తరుణ్,  నరేష్ గారు, మిర్నా, అషిక టీం అందరికీ థాంక్స్. నాగర్జున్ గారికి నేను బిగ్ ఫ్యాన్ ని. ఆయన చాలా అద్భుతమైన వ్యక్తి. నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. నా సామిరంగ పండగ లాంటి సినిమా. తప్పకుండా అందరూ జనవరి 14న చూడాలి’’ అని కోరారు

మిర్నా మీనన్ మాట్లాడుతూ.. నాగార్జున గారితో వర్క్ చేయడం నా డ్రీం. అది ఈ సినిమాతో నెరవేరింది. ఆయనతో వర్క్ చేయడం చాలా గొప్ప అనుభూతి. ఈ చిత్రం ఆయన కెరీర్ లో నెక్స్ట్ బెంచ్ మార్క్ మూవీ అవుతుంది. నరేష్ గారు, రాజ్ తరుణ్, ఆషికా అందరితో కలసి పని చేయడం ఆనందంగా వుంది. నా సామిరంగ పెర్ఫెక్ట్ సంక్రాంతి బొమ్మ. తప్పకుండా అందరూ సినిమా చూడండి’’ అని కోరారు. ఈ వేడుకలో చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News