Thursday, January 23, 2025

‘సీతారామం’ చూసి చాలా జలసీ ఫీలయ్యాః నాగార్జున

- Advertisement -
- Advertisement -

Nagarjuna speech at 'Sita Ramam' Success Meet

స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా రష్మిక మందన కీలక పాత్రలో వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించిన ప్రతిష్టాత్మక చిత్రం ’సీతారామం’. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల విడుదలై బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ నేపధ్యంలో ’సీతారామం’కు చారిత్రాత్మక విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ చిత్ర యూనిట్ ’సీతారామం’ థాంక్ యూ మీట్ నిర్వహించింది. కింగ్ అక్కినేని నాగార్జున ఈ ఈవెంట్‌లో ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ “అశ్వినీదత్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన కంటే నేను ఎక్కువగా ప్రేమించే వ్యక్తులు స్వప్న, ప్రియాంక. మహానటి, జాతిరత్నాలు, ఇప్పుడు సీతారామం .. వరుసగా అద్భుతమైన విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. ‘సీతారామం’ చూసి చాలా జలసీ ఫీలయ్యాను”అని తెలిపారు.

దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ “స్వప్న దత్ అద్భుతమైన నిర్మాత. మహానటి, ఇప్పుడు సీతారామం.. నా కోసం ఎప్పుడూ ప్రత్యేకమైన కథలే ఎంపిక చేస్తారు స్వప్న. తెలుగు, తమిళం, మలయాళం ఇలా అన్ని చోట్ల సినిమాకి అద్భుతమైన స్పందన వస్తోంది”అని అన్నారు. దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ “సీతారామం… నాకు బాగా దగ్గరైన కథ. తెరపై కనిపిస్తున్న రామ్, సీతలతో పాటు తెరవెనుక చాలా మంది మనిషి చేశారు” అని పేర్కొన్నారు. నిర్మాత అశ్వనీదత్ మాట్లాడుతూ మహానటి, ఇప్పుడు సీతారామంతో రెండు విజయాలు ఇచ్చిన దుల్కర్ మా సొంత హీరో అయిపోయారని అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్వీ ప్రసాద్, మృణాల్ ఠాకూర్ పాల్గొన్నారు.

Nagarjuna speech at ‘Sita Ramam’ Success Meet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News