Thursday, January 23, 2025

సంక్రాంతి పోరులో నాగార్జున?.. మరోసారి సెంటిమెంట్ తో హిట్ కొడతాడా?

- Advertisement -
- Advertisement -

ప్రతి సంక్రాంతి పండగకు తన సినిమాను రిలీజ్ చేసి హిట్ కొడుతున్నారు కింగ్ నాగార్జున. తన లాస్ట్ హిట్ చిత్రాలు సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు చిత్రాలను సంక్రాంతి కానుకగా విడుదల చేసి నాగార్జున హిట్ కొట్టారు. ఇప్పుడు అదే సెంటిమెంట్ తో 2024 సంక్రాంతికి కూడా తన సినిమాను బరిలో దింపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నాగార్జున నటిస్తున్న చిత్రం ‘నా సామిరంగ’.

ఈ మూవీకి ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్నారు. ఆశికా రంగనాథ్ కథానాయికగా నటిస్తుంది. ఈ మూవీని జనవరి 14న విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ చిత్రయూనిట్ ప్రకటించనుంది. మరోసారి సంక్రాంతికి వచ్చి హిట్ కొట్టాలని నాగ్ భావిస్తున్నాడట. అయితే, ఈ సారి మాత్రం సంక్రాంతి బరిలో నాలుగైదు బడా సినిమాలు ఇప్పటికే బెర్త్ కన్ఫామ్ చేసుకున్నాయి. ఈ క్రమంలో నాగ్ సినిమా.. కొంచెం తేడా కొట్టినా పరాజయం కావాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు.

కాగా, ‘నా సామి రంగ’ మూవీ పాటలకు, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ ధీమాతోనే నాగ్ సంక్రాంతి పోరుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. మరి ఈ రేసులో నాగ్ నిలబడతాడా? లేదా అన్నది మూవీ రిలీజ్ అయిన తర్వాత తెలుస్తది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News