Sunday, December 22, 2024

సురేఖపై పరువునష్టం పిటిషన్ పై రేపు నాగార్జున వాంగ్మూలం రికార్డు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తమ కుటుంబ వ్యవహారంలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై నటుడు అక్కినేని నాగార్జున వేసిన పరువు నష్టం పిటిషన్పై నాంపల్లి కోర్టు నేడు విచారించింది. నాగార్జున తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. పిటిషనర్ నాగార్జున వాంగ్మూలాన్ని మంగళవారం రికార్డు చేస్తామని కోర్టు తెలిపింది. కాగా నాగార్జున రేపు కోర్టుకు హాజరు కానున్నారు.

నాగార్జునతో పాటు సాక్షుల వాంగ్మాలాన్ని కూడా నమోదు చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. కాగా కోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. నటి సమంత, నటుడు నాగచైతన్య విడాకుల విషయంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. తమ కుటుంబ పరువుకు భంగం కలిగించేలా మాట్లాడిన ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున కోర్టును ఆశ్రయించారు. ఇదిలావుండగా టాలీవుడ్ నటులంతా నాగార్జున కుటుంబానికి అండగా నిలబడింది. విచారణ విషయంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News