Saturday, December 28, 2024

అల్ట్రా-స్టైలిష్ లుక్..

- Advertisement -
- Advertisement -

Nagarjuna's 'The Ghost' Shoot Wraps Up

కింగ్ అక్కినేని నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ’ది ఘోస్ట్’. మునుపెన్నడూ చూడని పాత్రలో పవర్‌ఫుల్ ఇంటర్‌పోల్ ఆఫీసర్ విక్రమ్‌గా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు నాగార్జున. శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై ఈ చిత్రం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఇటీవలే విడుదలైన ఘోస్ట్- కిల్లింగ్ మిషిన్‌కు భారీ స్సందన వచ్చింది. ఇంటర్‌పోల్ ఆఫీసర్ విక్రమ్‌గా నాగార్జున యాక్షన్ మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ప్రత్యేకంగా రూపొందించిన యాక్షన్ బ్లాక్ అందరినీ ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఒక స్పెషల్ వీడియో ద్వారా చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయినట్లు తెలియజేసింది చిత్ర యూనిట్. ఈ వీడియోలో నాగార్జున గన్ ఫైరింగ్ చేస్తూ కనిపించడం ఆకట్టుకుంటోంది.

దీంతో పాటు నాగార్జున, సోనాల్ చౌహాన్ లు ఒక పెద్ద జీప్ దగ్గర ఇంటర్‌పోల్ అధికారులుగా కనిపిస్తున్న పోస్టర్‌ని కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో వారి లుక్ అల్ట్రా- స్టైలిష్‌గా ఆకట్టుకుంది. అలాగే వారి దగ్గర వున్న మెషిన్ గన్‌లను చూస్తుంటే భారీ యాక్షన్‌కి రెడీ అవుతున్నట్లుగా అర్ధమవుతోంది. యాక్షన్, థ్రిల్లర్ సినిమాలకు సంగీతం అందించడంలో స్పెషలిస్ట్ మార్క్ కె. రాబిన్‌ను ఈ సినిమాకు ఎంచుకున్నారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలోకి రానుంది. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్‌తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Nagarjuna’s ‘The Ghost’ Shoot Wraps Up

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News