Monday, December 23, 2024

సాగర్‌ను అప్పగించండి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: కృష్ణానదిపై ఉన్న తెలుగురాష్ట్రాల ఉమ్మడి నీటిపారుదల ప్రాజెక్టు నాగార్జునసాగన్‌ను కృష్ణానదీయాజమాన్య బోర్డకు అప్పగించాలని కేంద్ర జల్‌శక్తిశా ఖ తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ఆదేశించింది. బుధవారం ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ అధ్యక్షతన తెలంగాణ, ఏపి నీటిపారుద శాఖల అధికారులతో సమావేశం జరిగింది. గత ఏడాది నవంబర్ 30న నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై వివాదం చెలరేగిన నేపధ్యంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఆదేశాల మేరకు జరిగిన ఈ సమావేశంలో కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టుల అప్పగింత, గెజిట్ నోటిఫికేష న్ అమలు, తెలుగు రాష్ట్రాల మధ్య నీటివాటాలు, వరద జలాల పంపిణీ తదితర అంశాలు చర్చకు వచ్చినట్టు సమాచారం. కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్ తదితర ప్రాజెక్టులను కృష్ణానదీయాజమాన్య బోర్డు పరిధిలోకి తెస్తూ 2021జులై 15న కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్ అమల్లో భాగంగా ప్రాజెక్టుల అప్పగింతపై కృష్ణాబోర్డు నిర్వహించిన సమావేశంలో తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్ర భుత్వాలు తొలుత ప్రాజెక్టుల అప్పగింతకు సుముఖత చూపాయి. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల అప్పగింతపై వెన క్కు తగ్గింది. కృష్ణానదీ జలాల్లో ఉమ్మడి ఏపికి బ చావత్ ట్రిబ్యునల్ చేసిన 811టిఎంసీల నీటి కేటాయింపుల్లో రెండు రాష్ట్రాల మధ్య పంపకాలపై విభేదాలు నడుస్తున్నాయి. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చేవరకూ కృష్ణానదీజలాల నీటి సర్దుబాటుకు సబంధించి2015లో నిర్వహించిన బోర్డు సమావేశంలో తాత్కాలిక అగ్రిమెంట్ కుదరింది. తెలంగాణకు 299టిఎంసీలు, ఏపికి 512టిఎంసీల చొప్పున సర్దుబాటు కుదిరింది. అయితే ఆ తర్వాత ఈ ఒప్పందం ఒక్క ఏడాదికి మాత్రమే అంగీకరించినట్టు తెలంగాణ ప్రభుత్వం పలు మార్లు బోర్డు దృష్టికి , కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయింది. ఈ అంశాలపై కూడా బుధవారం జరిగిన సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలిసింది.

సాగర్ వద్ద కేంద్ర బలగాలను కొనసాగించాలి
నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద కేంద్రం పరిధిలోని సిఆర్‌పిఎఫ్ బలగాల పర్యవేక్షణను కొనసాగించాలని తెలంగాణ, ఏపి ప్రభుత్వాలు ఢిల్లీ సమావేశంలో జలశక్తి శాఖ ముందు ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్టు సమాచారం. తొలుత ప్రాజెక్టును కృష్ణానదీయాజమాన్య బోర్డుకు అప్పగించాలని జలశక్తిశాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జి రెండు రాష్ట్రాల అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది. సాగర్‌నిర్వహణపై తమ ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వాలతో చర్చించి నిర్ణయం వెల్లడిస్తామని రెండు రాష్ట్రాల అధికారులు జలశక్తి శాఖ కార్యదర్శికి తెలిపినట్టు సమాచారం. సాగర్ విద్యుత్ ప్రాజెక్టులు , అవుట్‌లెట్లపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని , అంతేకాకుండా సాంకేతిప పరిమితులపైన కూడా నిర్ణయం జరగాల్సివుందని తెలిపారు. దీనీకి కేంద్ర కార్యదర్శి స్పందిస్తూ సాంకేతిక పరమైన అంశాలపైన రెండు రాష్ట్రాల ఆధికారులు చర్చించుకుని ఒక నిర్ణయానికి రావాలని సూచించారు. ఆ అంశాలపై రెండు రాష్ట్రాల నుంచి నివేదికలు వచ్చాకే తదుపరి సమావేశం నిర్వహించి నిర్ణయాలు వెల్లడిస్తామని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News