Monday, January 20, 2025

కాలేజీలో వేధింపులు… ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: విద్యార్థినుల వేధింపులు తట్టుకోలేక విద్యార్థిని మృతి చెందిన సంఘటన నాగర్‌కర్నూలు జిల్లా చారకొండ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…… అనూష (23) అనే యువతి రంగారెడ్డి జిల్లా షేర్‌గూడలో ఓ ప్రైవేటు కాలేజీలో బీఫార్మసీ మూడో సంవత్సరం చదువుతోంది. సదరు యువతి హాస్టల్‌లో ఉంటుంది. కాలేజీ, హాస్టల్‌లో తోటి విద్యార్థినులు వేధిస్తున్నారని సోదరుడు విజేందేర్ గౌడ్‌కు సమాచారం ఇచ్చింది. విజేందేర్ వెంటనే ఆమెను తీసుకొని ఇంటికి వెళ్లిపోయాడు. పొలం దగ్గర పనులు ఉండడంతో తల్లిదండ్రులను వ్యవసాయ బావి దగ్గర తీసుకెళ్లాడు. అనంతరం ఇంటికి వచ్చేసరికి అనూష ఉరేసుకొని కనిపించింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News