Monday, December 23, 2024

టిఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడిగా కాసర్ల నాగేందర్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

Nagender Reddy Re-Appointed As TRS Australia Chief

ప్రకటించిన కవిత ,మహేష్ బిగాల

హైదరాబాద్: 2016లో ఆస్ట్రేలియాలో టీఆర్ఎస్ ని స్థాపించి మొదటి సారి అధ్యక్షుడిగా ఎన్నికై, పార్టీని ఆస్ట్రేలియా వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో స్థాపించి, గులాబీ జెండాని ఎగరవేసి అత్యధిక సభ్యత్వ నమోదుచేసి, ఖండాంతరాలలో పార్టీ కార్యక్రమాలను, అభివృద్ధి, సంక్షేమ పథకాలను తెలియచేస్తూ, ప్రతిపక్షాల విమర్శలను తనదైన శైలిలో తిప్పి కొడుతూ అటు సోషల్ మీడియాలో ఇటు తెలంగాణలో పార్టీ నిర్వహించే కార్యక్రమాలలో భాగస్వాములవుతూ పార్టీ అధిష్టానం వద్ద మంచి గురింపు తెచ్చుకున్న కాసర్ల నాగేందర్ రెడ్డి ని మూడో సారి అధ్యక్షుడిగా కల్వకుంట్ల కవిత ఆదేశాలతో ఎన్ఆర్ఐ కో ఆర్డినేటర్ మహేష్ బిగాల నియమించారు. గురవారం ఎమ్మెల్సీ కవిత నివాసం లోనాగేందర్ రెడ్డిని తెరాస ఆస్ట్రేలియా శాఖ చేస్తున్న కార్యక్రమాల పై సంతృప్తి వ్యక్తం చేస్తూ నూతన నియామక ఉత్తర్వులు అందజేశారు. కోర్ కమిటీ లో డా. అనిల్ రావు చీటీ, రాజేష్ గిరి రాపోలు , సాయి రామ్ ఉప్పు , రవి శంకర్ దూపాటి, రవీందర్ ,రవి సాయల, రాకేష్ విశ్వామిత్ర, వినసన్నీ గౌడ్, సతీష్, ప్రవీణ్ , సనిల్, జస్వంత్ ,సంగీత, విక్రమ్, పరశురామ్, నరేష్ రెడ్డి లతో పాటు దాదాపు 150 మంది తో భారీ కమిటీని ప్రకటించారు. ఈ సందర్భంగా తన పై నమ్మకం ఉంచి మళ్లీ నియమించిన కవిత, మహేష్ బిగాలలకు నాగేందర్ రెడ్డి తో పాటు, కొత్తగా నియమించిన కార్యవర్గం కృతజ్ఞతలు తెలిపారు .

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News