Wednesday, January 22, 2025

నాగేశ్వరరావు జీవకళ ఉట్టిపడుతోంది: వెంకయ్య నాయుడు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నటుడు అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలు నిర్వహించారు. అన్నపూర్ణ స్టూడియోలో ఎఎన్‌ఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. అక్కినేని విగ్రహాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడారు. నాగేశ్వరరావు జీవకళ ఉట్టిపడుతోందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. అక్కినేని మహానటుడు, మహామనిషి అని, నాగేశ్వరరావు ఇక్కడే ఉన్నారా అన్నట్లు శిల్పం చెక్కారని ప్రశంసించారు. అనేక విషయాలపై ఇద్దరం చాలా సార్లు మాట్లాడుకునేవాళ్లం అని, అఖరి రోజు వరకు నటించిన మరో నటుడు ఉండరేమోనని కొనియాడారు. సినీరంగంలో విలువలు పాటించిన మహావ్యక్తి ఎఎన్‌ఆర్ అని చెప్పారు.

ఎఎన్‌ఆర్ శతజయంతి ఉత్సవాలకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అక్కినేని కుటుంబ సభ్యులు, అల్లు అరవింద్, బ్రహ్మానందం, మురళీమోహన్, జయసుధ, మోహన్‌బాబు, శ్రీకాంత్, జగపతిబాబు, రామ్‌చరణ్, రాజేంద్రప్రసాద్, మహేష్‌బాబు, విష్ణు, నాని, రానా, దిల్‌రాజు, సుబ్బిరామిరెడ్డి, డిజిపి అంజనీకుమార్, రామోజీ ఫిల్మ్‌సిటీ ఎండి విజయేవ్వరి, కీరవాణి, రాజమౌళి దంపతులు, తదితరలు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News