హైదరాబాద్: స్థిరాస్తి వ్యాపారి రవీందర్ రెడ్డి హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ పోలీసులు నాగిరెడ్డిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ధన్వాడ మండలం సంగినేనిపల్లిలో భూవివాదం హత్యకు దారితీసిందని రవీందర్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే నిందితుడు మోహన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నాగిరెడ్డిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. భూవివాదం నేపథ్యంలో రవీందర్ రెడ్డిపై నాగిరెడ్డి పగ పెంచుకున్నాడు. పదేళ్ల క్రితం సంగినేనిపల్లిలో రవీందర్ రెడ్డి భూమి కొనుగోలు చేశాడు. రెండేళ్లుగా భూవి విషయంలో రవీందర్ రెడ్డి, నాగిరెడ్డి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆస్తి విక్రయంలో కమిషన్ ఇవ్వలేదని మోహన్ రెడ్డి కక్ష పెంచుకున్నాడు. నాగిరెడ్డి, మోహన్ రెడ్డి కలిసి హత్యకు ప్రణాళిక రచించారు. వారం రోజుల క్రితం రవీందర్ రెడ్డిని మోహన్ రెడ్డి కత్తితో పొడిచి చంపాడు.