- Advertisement -
మనతెలంగాణ/ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో నాగోబా మహాపూజ కార్యక్రమాన్ని మేస్రం వంశీయులు ప్రారంభించారు. నాలుగు రోజుల క్రితం జన్నారం మండలం హస్థలమడుగు నుంచి తీసుకువచ్చిన గంగాజలంతో ఆలయ సమీపంలోని మర్రిచెట్టు కింద బస చేసిన మెస్రం వంశీయులు గురువారం అర్ధరాత్రి నాగోబా మహా పూజ చేయనున్నారు. ఇందులో భాగంగా నాగోబా విగ్రహాన్ని గ్రామం లోని ఉన్న చిన్న దేవాలయం నుంచి సంప్రదాయ వాయిద్యాలతో నాగోబా ఆలయానికి తీసుకువస్తారు. గంగా జలంతో అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
- Advertisement -