వేలాదిగా హాజరైన భక్తజనం
దర్శించుకున్న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
నిర్మల్: వారం రోజులుగా కొనసాగిన రాష్ట్రంలోనే రెండో అతి పెద్దదైన ఆదివాసుల జాతర నాగోబా సోమవారం అంగరంగ వైభవంగా ముగిసింది. ఈ సందర్భంగా మెస్రం వంశీయులు సంప్రదాయం ప్రకారం నాగోబాకు ప్రత్యేక పూజలు చేశారు. జాతర చివరి రోజు కావడంతో పలు ప్రదేశాల నుంచి వచ్చిన భక్తులు నాగోబాకు ప్రతేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుని తిరుగు ప్రయాణం అయ్యారు. జాతరకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ వారు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీస్‌శాఖ సిబ్బంది ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భారీ బందోబస్తూ ఏర్పాటు చేశారు.
నాగోబాను దర్శించుకున్న ప్రముఖులు
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సోమవారం ఇంద్రవెల్లి మండలంలోని కెస్లాపూర్‌లోని నాగోబా ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సంప్రద్రాయం ప్రకారం మెస్రం వంశీయులు బండారు దత్తాత్రేయ, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీ సోయంబాపురావు,కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఐటిడిఎ పిఓ భూమేష్‌మిశ్రా ఉన్నారు.