Sunday, December 22, 2024

ఖాకీ కావరం… కానిస్టేబుల్ దౌర్జన్యం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: లారీ డ్రైవర్‌పై కానిస్టేబుల్ దాడి చేయడంతో పాటు ప్రశ్నించిన వాహనదారులను అతడు దూషించిన సంఘటన రంగారెడ్డి జిల్లా ఎల్‌బినగర్ మండలంలోని నాగోల్‌లో జరిగింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం… బండ్లగూడలోని ఆనంద్‌నగర్ చౌరస్తాలో తాగునీటి పైపు లైన్ కోసం జలమండలి సిబ్బంది తవ్వకాలు చేపట్టారు. బారికేడ్లు ఏర్పాటు చేయడంతో రోడ్డు ఇరుకుగా మారింది.

రాత్రి పది గంటల సమయంలో ఇసుక లారీ ఇరుకు రోడ్డులో వెళ్తుండగా చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో పని చేసే కానిస్టేబుల్ అదే సమయంలో కారులో వెళ్తున్నాడు. రోడ్డు ఇరుకుగా ఉండడంతో లారీకి తగులుకుంటూ కారు వెళ్లింది. ఈ క్రమంలో లారీ డ్రైవర్ దూషిస్తూ అతడిపై కానిస్టేబుల్ దాడి చేశాడు. ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులలో ఒకరు కారును పక్కకు తొలగించాలని అడగడంతో అతడిని కూడా కానిస్టేబుల్ బండబూతులు తిట్టాడు. ఆనంద్‌నగర్ చౌరస్తాలో ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని తమకు సమాచారం రావడంతో కానిస్టేబుళ్లను పంపించానని సిఐ వివరణ ఇచ్చాడు. ఇప్పటివరకు ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని సిఐ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News