Monday, December 23, 2024

దొంగలు.. దొరికారు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నాగోల్ మహదేవ్ జ్యూవెలరీ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. దీనికి సంబంధించి ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన ముగ్గురితో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మరో ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. సీసీ కెమెరాల లైవ్ ట్రాకింగ్ ద్వారా నిందితులను గుర్తించినట్లు తెలిపారు. నిందితుల కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దోపిడీ చేసి బైక్‌లపై పరారయ్యారు నిందితులు. అనంతరం ఆ బైకులను హైదరాబాద్ శివారులో వదిలేసి వెళ్లారు. వివిధ రూట్లలో వెళ్లిన నిందితుల్ని లైవ్ ట్రాకింగ్ ద్వారా గుర్తించారు. కాగా గురువారం రాత్రి మహదేవ్ జ్యువెలర్స్‌లోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి, షాప్‌లోని బంగారం తీసుకుని పారిపోయారు. దుండగులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు 15 బృందాలను రంగంలోకి దింపారు.

మహదేవ్ జ్యువెలర్స్‌తో పాటు పరిసరాల ప్రాంతాల్లో సిసి కెమెరాలను పరిశీలిస్తున్న పోలీసులు నిందితులను గుర్తించేందుకు యత్నిస్తున్నారు. క్లూస్ టీమ్ కూడా ఘటన స్థలంలో ఆధారాలను సేకరించింది. మరోవైపు టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే దుండగులు పక్కాగా రెక్కీ నిర్వహించి ఈ దోపిడికి ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. కాల్పుల్లో గాయపడిన సుఖ్‌రామ్‌తో పాటు మరో వ్యక్తిని టార్గెట్ చేసి దుండగులు దోపిడికి ప్లాన్ చేశారు. బంగారం వ్యాపారం చేస్తున్న సుఖ్‌రామ్, రాజ్ కుమార్‌లు రిటైల్ షాపులకు బంగారం సరఫరా చేస్తుంటారు. వీరు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి కొన్ని ప్రాంతాల్లో బంగారం సప్లై చేశారు. అయితే వీరిని ఫాలో అవుతున్న దుండగులు మహదేవ్ జ్యువెలర్స్‌లో బంగారం సప్లై చేస్తుండగా షాప్‌లోని ప్రవేశించారు.

ఈ క్రమంలోనే కాల్పులు జరిపిన దుండగులు దాదాపు కిలో బంగారం, రూ. 1.70 లక్షల నగదుతో పరారయ్యారు. అయితే దుండగులు నెంబర్ ప్లేట్ లేని బైక్‌లను వినియోగించినట్టుగా స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఘటనలో గాయపడిన షాప్ యజమాని కళ్యాణ్ చౌదరి పాటు సుఖ్‌రామ్‌లకు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరిని శుక్రవారం సాయంత్రం రాచకొండ సీపీ మహేష్ భగవత్ పరామర్శించారు. కాల్పుల ఘటనపై వారి నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News