Monday, January 20, 2025

ఆగమాగమైన నాగ్‌పూర్..భారీ వర్షాలతో అతలాకుతలం

- Advertisement -
- Advertisement -

నాగ్‌పూర్ : మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో శనివారం భారీ వర్షాలు కురిశాయి. రహదార్లు, నివాసిత ప్రాంతాలు జలమయం అయ్యాయి. శనివారం ఈ పరిణామంతో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. రవాణా సౌకర్యాలు దెబ్బతినడంతో ఈ ప్రధాన నగరంలో జనజీవితం అతలాకుతలం అయింది. శుక్రవారం అర్థరాత్రి దాటినప్పటి నుంచి కుండపోత వానతో భారీగా వరద పరిస్థితి ఏర్పడింది.

దీనితో పల్లపు ప్రాంతాల ప్రజలను ముందుజాగ్రత్త చర్యగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సాయింత్రానికి ఎయిర్ పోర్టు వద్ద 106 మిమిల వర్షపాతం రికార్డు అయింది. ఈ ప్రాంతపు నేత, ఉప ముఖ్యమంత్రి దేవెంద్ర ఫడ్నవిస్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. ఎడతెరిపి లేని వానతో ఇక్కడి అంబాజరి జలాశయం పొంగిపొర్లింది. అధికారులు ఈ ప్రాంతంలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఢిల్లీలో పగటిపూటే చీకట్లు
దేశ రాజధాని ఢిల్లీలో శనివారం మధ్యాహ్నం అసాధారణ రీతిలో ఉన్నట్లుండి వాతావరణం మారిపోయింది. దట్టమైన కారుమబ్బులు కమ్ముకున్నాయి. దీనితో వాహనదారులు రాత్రిపూట పరిస్థితితో వాహనాల లైట్లు వేసుకుని సాగాల్సి వచ్చింది. పలు చోట్ల వరద నీరు రోడ్లను ముంచెత్తింది. చెట్లు కూలాయి. చిమ్మచీకట్లు , పిడుగులతో చాలా సేపటివరకూ భయానక పరిస్థితి నెలకొందని స్థానికులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News