Thursday, January 23, 2025

సిగరేట్ తాగుతున్నప్పుడు వీడియో తీశాడని… వ్యక్తిని పొడిచి చంపిన యువతి

- Advertisement -
- Advertisement -

ముంబయి: ఓ యువతి సిగరేట్ తాగుతుండగా వీడియో తీశాడని, అతడిని కత్తితో పొడిచి చంపిన సంఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నాగ్‌పూర్‌లోని మానేవాడ సిమెంట్ రోడ్డులో జయశ్రీ పాండే అనే యువతి తన స్నేహితులతో కలిసి సిగరేటు తాగుతోంది. అదే సమయంలో రంజిత్ రాథోడ్(28) అనే వ్యక్తి సిగరేటు తాగడానికి అక్కడికి వచ్చాడు. ఫోన్ తీసి వీడియో తీస్తుండగా ఎందుకు తీస్తున్నావని ఆమె అతడిని అడిగింది. దీంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. ఘర్షణ జరిగినప్పుడు రాథోడ్ వీడియో రికార్డు చేశాడు.

అక్కడి నుంచి రాథోడ్ వెళ్లిపోయిన తరువాత జయశ్రీ తన స్నేహితులు ఆకాశ్ రౌతూ, జీతూ జాదవ్‌లను రమ్మని కబురు పంపించింది. ముగ్గురు కలిసి రాథోడ్ కోసం వెతుకుతుండగా మహాలక్ష్మీనగర్‌లో అతడు కనిపించాడు. జయ శ్రీ తన స్నేహితులతో కలిసి అతడిని చితక బాదారు. అనంతరం కత్తి తీసుకొని అతడి కడుపులో ఆమె పలుమార్లు పొడవడంతో చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దత్తవాడకు పారిపోయిన ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News