Monday, December 23, 2024

ప్రియుడి ప్రాణం తీసిన సందేశాలు

- Advertisement -
- Advertisement -

ముంబయి: సామాజిక మాధ్యమాల్లో తన ప్రియురాలికి సందేశాలు ఎందుకు పంపుతున్నావని అడిగినందుకు ప్రియుడ్ని పొడిచి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం నాగ్‌పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శ్రేయాన్ష్ పటేల్‌కు ఓ ప్రియురాలు ఉంది. అమిత్ మెశ్రమ్ అనే వ్యక్తి ఆమెకు సోషల్ మీడియాలో సందేశాలు పంపించాడు. ఈ విషయం పటేల్‌కు తెలియడంతో ఇద్దరు బెదిరించుకుంటూ సందేశాలు పంపించుకున్నారు. గురువారం అమిత్ మెశ్రమ్ ఇద్దరు మైనర్లతో కలిసి పటేల్‌తో గొడవపడ్డారు. అమిత్ కత్తి తీసుకొని పటేల్ కడుపులో పొడవడంతో రాడ్ తీసుకొని పలుమార్లు అతడి తలపై బాదాడు. పటేల్ ఘటనా స్థలంలోనే చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని అమిత్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇద్దరు మైనర్లను జువైనల్ హోమ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News