Tuesday, November 5, 2024

నాగపూర్ సంఘటన ఒక విషాదం

- Advertisement -
- Advertisement -

నాగపూర్‌లో వయాగ్రా వేసుకుని మద్యం సేవించిన 41 ఏళ్ల వ్యక్తి 24గంటల్లోనే చనిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి వైద్య పరిశోధకులు రూపొందించిన నివేదికలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. అంగ స్తంభన సమస్యతో బాధపడుతున్న ఓ వ్యక్తి రెండు వయాగ్రా ట్యాబ్లెట్లు వేసుకుని అదే సమయంలో ఆల్కహాల్ సేవించాడు. ఆ మరునాడే బ్రెయిన్‌లో తీవ్ర రక్తస్రావమై ప్రాణాలు కోల్పోయాడు. ఆరుగురు సభ్యులతో కూడిన ఢిల్లీ ఎయిమ్స్ పరిశోధకులు దీనిపై కేసు నమోదు చేసి గత ఏడాది సెప్టెంబర్‌లో నివేదిక రూపొందించారు.

ఈ వారమే ఆన్‌లైన్‌లో ఇది అందుబాటులో ఉంచారు. ఫోరెన్సిక్, లీగల్ మెడిసిన్ జర్నల్‌లో కూడా ఇది ప్రచురితమైంది. వయగ్రా తీసుకుని మద్యం తాగడం వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయనే విషయంపై ఈ పరిశోధకులు పరిశోధనలు జరిపారు. ఈ ఘటనలో మరణించిన 41ఏళ్ల వ్యక్తికి గతంలో ఎలాంటి ఆరోగ్యసమస్యలు లేవని, అతనికి శస్త్ర చికిత్సలు కూడా జరగలేదని గుర్తించారు. అతడు చనిపోడానికి ముందు రోజు తన స్నేహితురాలితో హోటల్‌లో ఉన్నాడు. 50 ఎంజి చొప్పున రెండు వయాగ్రా ట్యాబ్లెట్లతో పాటు ఆల్కహాల్ సేవించాడు.

తెల్లారేసరికి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. తెల్లవారు జామున వాంతులు చేసుకున్నాడు. ఆస్పత్రికి వెళ్దామని స్నేహితురాలు చెప్పినా వినిపించుకోలేదు. గతం లోనూ ఇలాగే అయిందని చెప్పి ఊరుకున్నాడు. తర్వాత కొద్దిసేపటికే తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. వయాగ్రా పిల్స్ వేసుకోవడం వల్ల క్రమక్రమంగా అతని మెదడుకు ఆక్సిజన్ సరఫరా తగ్గిపోయి సెరెబ్రో వాస్కులర్ హెమరేజి ఏర్పడటంతో అతను చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు.

మెదడులో గడ్డకట్టిన రక్తం 300 గ్రాములు ఉన్నట్టు పోస్టుమార్టమ్ నివేదిక తేల్చింది. అలాగే అతని గుండె నాళాలు గట్టిపడడంతోపాటు కాలేయం, మూత్రపిండాలు దెబ్బతిన్నట్టు వెల్లడైంది. వైద్యుల సూచన లేకుండా వయాగ్రా వాడకూడదని పరిశోధకులు హెచ్చరించారు. దీనివల్ల ఎలాంటి పరిణామాలు ఉంటాయనే విషయం పైనా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News