Tuesday, November 5, 2024

రేపు నాగ్‌పూర్ సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్రలోని నాగ్‌పూర్ తెలంగాణలోని సికింద్రాబాద్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సెప్టెంబర్ 16న ప్రారంభ ం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ పర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించనున్నారు. రెగ్యులర్ సర్వీసును మాత్రం సెప్టెంబర్ 19 నుండి నడుపనున్నారు. ఈ రైలు నాగ్‌పూర్, సికింద్రాబాద్ మధ్య 585 కిలో మీటర్ల దూరాన్ని 7 గంటల 15 నిమిషాల్లో చేరుకుంటుంది. ఈ రైలు 2 ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌లు, 18 చైర్ కార్ కోచ్‌లు కలిగి ఉండి మొత్తం 1440 సీట్లు ఉంటాయి. ఈ రైలులో ప్రయాణికులు నాగ్‌పూర్, బల్హర్షా, ఇతర పట్టణాల నుండి సికింద్రాబాద్ చేరుకోవడానికి పగటిపూట ప్రయానించేందుకు అనుకూలంగా ఉంటుంది.

రైలు నంబర్ 20101 నాగ్‌పూర్ – సికింద్రాబాద్ , నాగ్‌పూర్ నుండి ఉదయం 05.00 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 20102 సికింద్రాబాద్ – నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ నుండి మధ్యాహ్నం1 గంటలకు బయలుదేరి రాత్రి 8.20 గంటలకు నాగ్‌పూర్ చేరుకుంటుంది. మార్గ మధ్యంలో ఈ రైలు సేవాగ్రామ్ , చంద్రాపూర్ , బల్హర్షా , రామగుండం, కాజీపేట రైల్వే స్టేషన్లలో ఇరువైపు ప్రయాణాలలో ఆగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News