Thursday, January 23, 2025

కన్నుల పండుగగా నాగుల చవితి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నాగదేవతలను గౌరవించటానికి హిందువులు కార్తీక మాసంలో నాగుల చవితిని జరుపుకుంటారు. నాగదేవతలను శాంతింపజేయడం శాంతి, శ్రేయస్సు, రక్షణను తెస్తుంది కాబట్టి హిందూ సంస్కృతిలో ఈ పవిత్రమైన రోజుకు అపారమైన ప్రాముఖ్యత ఉంది. ఇది దీపావళి తరువాత వచ్చే పండుగ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. కార్తీక మాసంలో శుక్ల పక్ష చతుర్థి తిథి నాడు నాగుల చవితి వస్తుంది.

తెలుగురాష్ట్రాల్లో నాగుల చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని నాగదేవత ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శుక్రవారం నాడు మహిళలు పెద్ద ఎత్తున కన్నుల పండుగగా నాగుల చవితి జరుపుకున్నారు. నాగుల చవితి సందర్భంగా వేకువజామున నాగుల పుట్ట వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుట్టలో పాలు, గుడ్లు, పూలు, పండ్లు పెట్టి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి రోజున నాగుల పుట్టలో పాలు పోసి పూజలు చేస్తే వారి కుటుంబాలు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో సిరి సంపదలు కలుగుతాయని, వారి మాంగళ్య బలం సమృద్ధిగా ఉంటుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News