- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలో నాగులప్పలపాడు వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మద్దిరాలపాడు వద్ద ఒంగోలు- కత్తిపూడి జాతీయరహదారిపై ఆగి వున్న లారీని బైక్ ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు మృతి చెందారు. మృతులు కొరిశపాడు మండల పమిడిపాడు వాసులుగా గుర్తించారు. వినాయక విగ్రహం కొనుగోలు కోసం ఒంగోలు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.
Also Read: ట్రెండింగ్‌లో పాలమూరు ప్రాజెక్టు టాప్
- Advertisement -