Wednesday, January 22, 2025

“హ్యాపీ ఎండింగ్” నుంచి ప్లెజంట్ లవ్ ఫీల్ సాంగ్

- Advertisement -
- Advertisement -

చెప్పాలని ఉంది, అలాంటి సిత్రాలు, శాకుంతలం వంటి సినిమాలతో టాలెంటెడ్ యంగ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు యష్ పూరి. ఆయన హీరోగా నటిస్తున్న కొత్త సినిమా హ్యాపీ ఎండింగ్. ఈ చిత్రంలో అపూర్వ రావ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని హమ్స్ టెక్ ఫిలింస్, సిల్లీ మాంక్స్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యోగేష్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల నిర్మాతలు. కౌశిక్ భీమిడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ రాగా…ఇప్పుడు మరో బ్యూటిఫుల్ మెలొడీ ‘నగుమోము..’ లిరికల్ సాంగ్ ను శుక్రవారం విడుదల చేశారు.

లవ్ ఫీలింగ్స్ తో హృదయాల్ని తాకేలా నగుమోము పాటను చిత్రీకరించారు. సంగీత దర్శకుడు నిడమర్తి రవి అందించిన బ్యూటిఫుల్ ట్యూన్ కు లక్ష్మీ ప్రియాంక సాహిత్యాన్ని రాయగా.. కృష్ణ తేజస్వి  పాడింది. నగుమోము కనగానే నాలోన మెరుపే మెరిసే విరిసే ..అంటూ ప్లెజంట్ కంపోజిషన్ తో పాట సాగింది. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉన్న హ్యాపీ ఎండింగ్ మూవీని త్వరలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News