Monday, January 20, 2025

హర్యానా కొత్త సిఎంగా నాయబ్ సైనీ

- Advertisement -
- Advertisement -

ఛండీగఢ్: హర్యానా కొత్త సిఎంగా నాయబ్ సైనీ పేరును బిజెపి అధిష్ఠానం ఖరారు చేసింది. నాయబ్ సైనీ ప్రస్తుతం కురుక్షేత్ర పార్లమెంటు నియోజక వర్గం నుంచి ఎంపిగా సేవలందిస్తున్నారు. మంగళవారం సాయంత్రం నాయబ్ సైనీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బిజెపి-జెజెపి కూటమిలో విభేదాలు రావడంతో ఖట్టర్ రాజీనామా చేసినట్టు సమాచారం. నాయబ్ సైనీ హర్యానా రాష్ట్ర బిజెపి ప్రెసిడెంట్‌గా ఉన్నారు. నారాయణ్‌గఢ్ అనే నియోజకవర్గం నుంచి 2014లో ఎంఎల్‌ఎగా గెలుపొందారు. 2019 లోక్ సభ ఎన్నికలలో కురుక్షేత్ర నుంచి విజయం సాధించారు. బిసి కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కావడంతో సిఎం రేసులోకి దూసుకొచ్చాడని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News