Thursday, December 12, 2024

బియ్యం స్మగ్లింగ్ ను అరికట్టేందుకు ‘సిట్’ను ఏర్పాటు చేసిన చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ప్రజా పంపిణీ బియ్యం పేదలకు అందకుండా స్మగ్లింగ్ జరుగుతుండడంతో దానిని అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)ను  సీనియర్ ఐపిఎస్ అధికారి వినీత్ బ్రిజ్ లాల్ నేతృత్వంలో ఏర్పాటు చేశారు. కాకినాడ రేవు నుంచి రేషన్ బియ్యం స్మగ్లింగ్ అవుతున్న వ్యవహారం ఇటీవల వెలుగు చూసింది. ఇటీవల ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ రేవు లో తనిఖీ చేశారు. రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి ప్రీమియం ఎక్స్ పోర్ట్ క్వాలిటీ బియ్యం కింద విదేశాలకు అమ్ముకుంటున్న విషయం వెలుగు చూసింది. ముఖ్యంగా ఈ బియ్యానికి ఆఫ్రికా దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ఎగుమతిదారులు కస్టమ్ హౌస్ ఏజెంట్లతో కుమ్మకయి స్మగ్లింగ్ చేస్తున్నారు. ఈ బియ్యం స్మగ్లింగ్ నెట్ వర్క్ వెనుక వైఎస్ఆర్సిపి నాయకులున్నట్లు అనుమానిస్తున్నారు.

ఇదిలా ఉంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం(పిడిఎస్) సిస్టంలో లొసుగులు ఉన్నట్లు విజిలెన్స్ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ జనరల్ కనుగొన్నారు. అసమర్ధత, అవినీతి, వ్యవస్థీకృత నేర కార్యకలాపాలు బియ్యం స్మగ్లింగ్ లో వెలుగుచూశాయి. అందుకనే చంద్రబాబు నాయుడు ‘సిట్’ ను ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News