Thursday, January 2, 2025

లెబనాన్ హిజ్బుల్లా కొత్త చీఫ్ గా నయీమ్ ఖాస్సేమ్

- Advertisement -
- Advertisement -

లెబనాన్‌కు చెందిన హిజ్బుల్లా తన కొత్త చీఫ్‌గా షేక్ నయీమ్ ఖాస్సేమ్‌ను ప్రకటించింది. మునుపటి చీఫ్ హసన్ నస్రల్లా హత్యకు గురైన కొన్ని రోజుల తర్వాత అతను నియమింతుడయ్యాడు. అతను ఇజ్రాయెల్ హత్య చేస్తుందేమోనని భయపడి ఇదివరలో లెబనాన్ నుండి పారిపోయాడు.

ఇజ్రాయెల్ నుండి బాధాకరమైన ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ హిజ్బుల్లాహ్ “మొదట ఏడవదు” అని పేర్కొంటూ, హిజ్బుల్లా, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న సంఘర్షణను ఖాస్సేమ్ వివరించాడు. హిజ్బుల్లా కార్యాచరణ బలాన్ని పునరుద్ఘాటిస్తూ, హిజ్బుల్లా మిత్రపక్షమైన పార్లమెంటరీ స్పీకర్ నబీహ్ బెర్రీ కాల్పుల విరమణను పాటించేందుకు చేసిన ప్రయత్నాలకు మద్దతునిచ్చాడు- ఇజ్రాయెల్‌పై  హిజ్బుల్లా కాల్పులను ఆపడానికి… గాజా సంధిపై ముందస్తు పట్టుదలని తొలిసారి విస్మరించాడు. సయ్యద్ హసన్ నస్రల్లా వారసుడు అవుతాడని విస్తృతంగా అంచనా వేసిన హషేమ్ సఫీద్దీన్‌ను ఇజ్రాయెల్ దీనికి ముందు హతమార్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News