Monday, January 20, 2025

పిన్న వయసులోనే పిహెచ్‌డి: నైనా జైస్వాల్ రికార్డు

- Advertisement -
- Advertisement -

టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ రికార్డు
మనతెలంగాణ/హైదరాబాద్: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం నుండి అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్ 22 సంవత్సరాల చిన్న వయస్సులోనే పిహెచ్‌డి డిగ్రీ పూర్తి చేసి భారతదేశంలోనే తొలి పిన్న వయస్కురాలైన డాక్టరేట్‌గా నిలిచారు. పిహెచ్‌డి అవార్డును ఆంధ్రప్రదేశ్ గవర్నర్, ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఛాన్సలర్ అబ్దుల్ నజీర్ నైనా జైస్వాల్‌కు అందజేసి ఆమెను అభినందించారు. భారతదేశంలో 22 సంవత్సరాల వయస్సులో డాక్టరేట్ పొందిన అతి పిన్న వయస్కురాలిగానూ, మొట్టమొదటి అమ్మాయి అయినందుకు నైనా జైస్వాల్‌ను సంతోషం వ్యక్తం చేశారు.

‘తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించి మహిళా సాధికారతలో మైక్రోఫైనాన్స్ పాత్ర’ అనే అంశంపై నన్నయ విశ్వవిద్యాలయ పూర్వ ఉపకులపతి ఆచార్య ముర్రు ముత్యాలు నాయుడు మార్గదర్శకంలో ఆమె పరిశోధన పూర్తి చేశారు. స్వయం సహాయక బృందాలు, మైక్రోఫైనాన్స్‌కు సంబంధించిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించానని నైనా చెప్పారు. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, మహిళా సాధికారత పరంగా మైక్రోఫైనాన్స్ పాత్ర, ప్రాముఖ్యత చాలా ముఖ్యమైనదని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News