- Advertisement -
హైదరాబాద్: ఓ యువకుడు నగ్నంగా పక్కింట్లోకి చొరబడిన సంఘటన హైదరాబాద్లోని నేరేడ్మెట్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. 18 ఏళ్ల యువకుడు సంతోష్ నగర్ కాలనీలో నివసిస్తున్నాడు. రాత్రి సమయంలో ఒంటిపై నూలుపోగు లేకుండా బయటకు వచ్చి పక్కింట్లోకి వెళ్లాడు. కిటీకిలో నుంచి చూడగా పక్కింటి గమనించి స్థానికులను అప్రమత్తం చేశాడు. పట్టుకొవడానికి ప్రయత్నించినప్పటికి ఆ యువకుడు పారిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి యువకుడి కోసం గాలిస్తున్నారు.
- Advertisement -