Wednesday, January 22, 2025

నకిరేకల్‌ను మోడ్రన్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: నకిరేకల్‌ను మోడ్రన్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని, అభివృద్ది చేసే నాయకునికి పట్టం కట్టాలని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవారం నకిరేకల్‌పట్టణంలోని 15, 16వ వార్డులలో పర్యటించి వార్డు ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వార్డులో సీసీరోడ్లు లేని చోట తొందర్లోనే పనులు ప్రారంభిస్తామన్నారు.

అనంతరం రజక కులస్తులకు కమ్యూనిటీ హాల్, మోడ్రన్ దోబీ ఘాట్ నిర్మించడానికి స్థలాన్ని పరిశీలించారు. సాంఘిక సంక్షేమ బాఇకల వసతి గృహాన్ని పరిశీలించి విద్యార్ధులతో మాట్లాడి భోజన వసతి గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్‌గౌడ్, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News