Wednesday, January 22, 2025

టికెట్ దక్కని ఆశావహులు కాంగ్రెస్ పార్టీ వైపు…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌ఎస్‌లో టికెట్ ఆశించి జాబితాలో పేరు లేని ఆశావహులు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే టికెట్ ఆశించి భంగపడ్డ బిఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా, తాజాగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం బిఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడంతో పాటు తన అనుచరులతో వేరే పార్టీలో చేరడానికి సమాయత్తం అవుతున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నకిరేకల్ టికెట్ ఆశించిన వేముల వీరేశంకు టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.

ఈ నేపథ్యంలో కార్యకర్తలతో బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించిన వేముల మరో పది రోజుల్లో కార్యకర్తలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. ఇప్పటికే ఆయన కాంగ్రెస్ నాయకులతో చర్చలు జరిపారని త్వరలోనే వేముల హస్తం గూటికి చేరడం ఖాయమని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. నకిరేకల్ ఎమ్మెల్యే టికెట్‌ను సిఎం కెసిఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు కేటాయించడంతో తీవ్ర అసంతృప్తికి గురైన వేముల బిఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News