మన తెలంగాణ/హైదరాబాద్: వర్షా కాలం ప్రవేశించడంతో నాలాల పూడిక తీతను తక్షణమే పూర్తి చేయాలని జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను అదేశించారు. తద్వారాలోతట్టు ప్రాంతవాసులు వరద ముంపు భారిన పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా బంజారాహిల్స్ ప్రేమ్ నగర్ కాలనీ లో మేయర్ పర్యటించారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం కావడం ద్వారా కాలనీ సమగ్ర అభివృద్ధికి దోహద పడలన్నారు.ఈ సందర్భంగా కాలనీ ల సమస్యలను ఆరా తీసిన మేయర్ తన దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అక్కడిక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో వరద నివారణకు గాను నాలాల పునరుద్దరణ, రిటైన్నింగ్ వాల్ నిర్మాణాల కోసం గ్రేటర్ పరిధిలో చేపట్టిన 37 పనులు ఇప్పటికే వివిధ దశకు చేరుకున్నాయని వెల్లడించారు. వర్షకాలం ముందస్తూ ప్రణాళికలో భాగంగా వరద ముంపు నివారణకు ప్రత్యేక మాన్ సూన్ బృందాలను కూడా ఏర్పాటు చేయడంతో పాటు నాలాల కారణంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా వరద ప్రమాదాల నివారణకు రక్షణ చర్యలు చేపట్టినట్లు చెప్పారు. జోనల్ వారీగా వల్బారెబుల్ పాయింట్ల ను గుర్తించి చైన్ లింక్ మేష్ లు, ప్రీకాస్టు స్లాబ్స్, హెచ్చరిక బోర్డ్ లు ఏర్పాటు చేసినట్లు మేయర్ వివరించారు. అంతకు ముందు డ్రెస్ కోడ్ పాటించని ఎస్‌ఎఫ్ ఎలతో పాటు పారిశుద్ద కార్మికులపై మేయర్ అగ్రహాం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎన్‌డిపి సిఈ కిషన్, ఇతర విభాగపు అధికారులు తదితరులు పాల్గొన్నారు.