Monday, January 20, 2025

నలంద ఒక పేరు కాదు..ఒక గుర్తింపు: మోడీ

- Advertisement -
- Advertisement -

గ్రంథాలను కాల్చవచ్చు జ్ఞానాన్ని కాదు
నలంద విశ్వవిద్యాలయం నూతన క్యాంపస్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ

పాట్నా: నలంద ఒక పేరు మాత్రమే కాదని, అది ఒక గుర్తింపు, ఒక గౌరవమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బీహార్‌లోని నలంద విశ్వవిద్యాలయం నూతన క్యాంపస్‌ను ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నలంద ఒక అమూల్యమైన పందని, అది ఒక మంత్రమని ఆయన చెప్పారు. పుస్తకాలను అగ్ని ఆహుతి చేయవచ్చునేమోకాని జ్ఞానాన్ని చెరిపివేయలేవని ప్రధాని అన్నారు. మూడవసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి బీహార్‌ను సందర్శించిన ప్రధాని మోడీ నలంద విశ్వవిద్యాలయంలో గతంలో చవిచూసిన పోరాటాలను గుర్తు చేశారు. నలందను ఒక రుషిగా ఆయన అభివర్ణించారు. నలంద విశ్వవిద్యాలయం చరిత్ర ఒక్క భారతదేశానికే పరిమితం కాదని, అది ఆసియా ఖండానికే చెందినదని మోడీ అన్నారు.

విశ్వవిద్యాలయం పునర్నిర్మాణంలో మన పొరుగుదేశాలు కూడా పాల్గొన్నాయని ఆయన వెల్లడించారు. ఇది వసుదైక కుటుంబం స్ఫూర్తిగా ఆయన పేర్కొంటూ ప్రపంచ నలుమూలల నుంచి విద్యార్థులు ఇక్కడకు వస్తున్నారని, 20 దేశాలకు పైగా విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారని ప్రధాని తెలిపారు. అంతకుముందు ఆయన నలంద విశ్వవిద్యాలయానికి చెందిన శిథిలాలను సందర్శించారు. వీటిని 2016లో యునెస్కో వారసత్వ సంపదగా ప్రకటించింది. భారతదేశ గత వైభవ చిహ్నమైన నలంద విశ్వవిద్యాలయాన్ని ప్రధాని కీర్తిస్తూ ప్రపంచ దేశాలకు చెందిన యువజనుల వ్యిపరమైన అవసరాలను ఈ విశ్వవిద్యాలయం తీర్చగలదనడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పారు. మన విద్యా రంగంలో నేడు ఒక ప్రత్యేక సుదినమని ఎక్స్ వేదికగా ప్రధాని తెలిపారు. ఉదయం 10.30 గంటలకు నలంద విశ్వవిద్యాలయానికి చెందిన నూతన క్యాంపస్‌ను రాజ్‌గిర్ వద్ద ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Nalanda is not name and an identity

మన గత వైభవంతో దీనికి బలమైన అనుబంధం ఉందని ఆయన తెలిపారు. విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్, బీహార్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, ముఖ్యమంత్రి నితీష్ కుమార్, నలంద యూనివర్సిటీ వైస్ చాన్సలర్ అరవింద్ పనగరియ ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం జైశంకర్ మాట్లాడుతూ ఈ ప్రాచీన విశ్వవిద్యాలయం పునరుజ్జీవంతో విద్యార్జనలో ఇది లంతర్జాతీయ వారధిగా ఆవిర్భవించగలదని అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, భూటాన్, బ్రూనై, దారస్సలాం, కాంబోడియా, చైనా, ఇండోనేషియా, లావోస్, మారిషస్, మయన్మార్, న్యూజీల్యాండ్, పోర్చుగల్, సింగపూర్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వియత్నాంతోసహా 17 దేశాలకు చెందిన విదేశీ రాయబారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కొత్తగా నిర్మించిన క్యాంపస్‌ను రెండు అకాడమిక్ బ్లాకులుగా విభజించారు. ఒక్కో బ్లాకులో 40 తరగతి గదులు ఉంటాయి. మొత్తం సీటింగ్ సామర్ధం దాదాపు 1900 ఉంటుంది. రెండు ఆడిటోరియంలు ఉన్నాయి. ఒక్కో ఆడిటోరింయం సీటింగ్ సామర్ధం 300. 550 మంది విద్యార్థులకు వసతి సమకూర్చగల హాస్టల్ ఉంది. అంతర్జాతీయ సెంటర్, 2,000 మంది కూర్చునే క ఆడిటోరియం, ఫ్యాకల్టీ క్లబ్, స్పోర్ట్ కాంప్లెక్స్ వంటి అనేక సౌకర్యాలను ఇందులో ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News