Sunday, January 19, 2025

రెండు చోట్ల బిజెపి అభ్యర్థ్ధులు ‘పేట’ జిల్లా వాసులే..

- Advertisement -
- Advertisement -

ఇద్దరూ బిఆర్‌ఎస్ నుంచి వలసదారులే..

వజ్జె వీరయ్య/సూర్యాపేట జిల్లా ప్రతినిధి: నాలుగు శాసనసభ నియోజకవర్గాలు కలిగి ఉన్న సూర్యాపేట జిల్లా నుంచి వచ్చే నెలలో జరుగను న్న సార్వత్రిక ఎన్నికల సమరంలో పార్టీల అభ్యర్థ్ధిత్వం ఒక పార్టీ నుంచే ఇద్దరికి దక్కింది. జిల్లా లో నాలుగు శాసనసభ నియోజకవర్గాలు ఉండ గా మూ డు నియోజకవర్గాలు సూర్యాపేట, కోదాడ, హు జూర్‌నగర్ నల్లగొండ లోక్‌సభ పరిధిలో ఉ న్నా యి. తుంగతుర్తి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉంది. ఈ రెండు శాసనసభ ని యోజకవర్గాల్లో త్రిముఖ పోరు (కాంగ్రెస్, భారా స, భాజపా) మధ్య జరుగనుంది. రెండు నియోజకవర్గాల పరిధిలో ఉన్న సూర్యాపేట జిల్లా నుంచి ప్ర ధాన పార్టీల్లో అభ్యర్థిత్వం ఇద్దరికి బిజెపి నుంచి ఇప్పటికే ఖరారైన సంగతి తెలిసిందే. భువనగిరి నుంచి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ కాగా నల్లగొండ నుంచి మాజీ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డికి బిజెపి అ భ్యర్థిత్వం ఖరారైన సంగతి విధితమే. కాగా, ఈ ఇద్దరు నేతలు కొన్ని మాసాల వ్యవధి తేడాతో భారాస నుంచి భాజపా తీర్థం పుచ్చుకున్నవారే. ఎంతో చారిత్రక నేపథ్యం, స్వాతంత్య్ర సమ రం మొదలుకొని అటు పిమ్మట నైజాం సంస్థాన పాలన నుంచి విముక్తి పొం దేందుకు సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి సారధ్యం వహించిన నాయకులకు పుట్టినిల్లు కాక వీరోచితంగా సాగిన గెరిల్లా యుద్ధంలో పా ల్గొన్న వీరులకు సైతం ఈ ప్రాంతంలో కొదువ లేదు.

అప్పటి నుంచి సాగిన ప్ర తి ఉద్యమంలో తెలంగాణ ప్రాంతం పేరుతో భాగంగా సూర్యాపేట ప్రాంత కీర్తి ప్రతిష్టలు ప్రపంచానికి చాటే చెప్పే క్రమానికి పేరెన్నిక గల ప్రాంతంగా సూర్యాపేటకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలాంటి జిల్లా నుంచి ఇప్పటివరకు జరిగిన ప్రతి ఎన్నికల్లోను ప్రధాన పార్టీల్లో సింహ భాగం అభ్యర్థ్ధిత్వాలు కూడా ఆ స్థాయిలోనే దక్కేవి. కానీ, వచ్చే నెల రెండవ వారంలో జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాలైన నల్లగొండ నుంచి ప్రధాన పార్టీల అభ్యర్థులుగా కుందూరు రఘువీర్ రెడ్డి (కాంగ్రెస్), కంచర్ల కృష్ణారెడ్డి (భారాస), శానంపూడి సైదిరెడ్డి (భాజపా) అభ్యర్థ్ధిత్వం దక్కించుకోగా భాజపా అభ్యర్ధి మా త్రమే సూర్యాపేట జిల్లాకు చెందినవారు. భువనగిరి నుంచి చామల కిరణ్ కు మార్‌రెడ్డి (కాంగ్రెస్), డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ (భాజపా), క్యామ మల్లేష్ (భారాస) ప్రధాన పార్టీల నుంచి పోటీ దారులుగా నిలవనున్న విషయం తెలిసిందే. ఈ ఆరుగురిలో ఇద్దరు మాత్రమే సూర్యాపేట జిల్లా వాసులు కాగా బూర నర్సయ్య గౌడ్ తాను పోటీ చేస్తున్న నియోజకవర్గం తన సొంత గ్రామం పరిధిలోనిది కాదు. మొత్తానికి సూర్యాపేట జిల్లా నుంచి పోటీలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇద్దరూ భాజపాకు చెందినవారే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News