Wednesday, January 22, 2025

నల్లగొండను ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం: కోమటిరెడ్డి

- Advertisement -
- Advertisement -

నల్గొండ: మహాత్మాగాంధీ వర్సిటీలోని ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఇటీవల జరిగిన జాబ్ మేళాలో ఆరు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని తెలియజేశారు. మే నెలలో నల్లగొండలో మరో జాబ్ మేళా నిర్వహిస్తామని చెప్పారు. నల్లగొండలో పలు అభివృద్ధి పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా నల్లగొండను ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. రూ.600 కోట్లతో చేపట్టే నల్లగొండ ఒఆర్‌ఆర్ పనులకు వచ్చే నెల టెండర్లకు పిలుస్తామని, ఆరు వరసల రోడ్డు పనులకు ఆగస్టు 15 నాటికి పూర్తి చేస్తామని మంత్రి వివరించారు. రోడ్డు, డ్రెయిన్ల పనులు నాణ్యతపై రాజీపడవద్దని కాంట్రాక్టర్లకు ఆదేశించామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News