Wednesday, January 22, 2025

మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

నల్గొండ జిల్లా మిర్యాలగూడ బైపాస్ పై సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని లారీ కారును ఢీకొట్టడంతో ఐదుగురు ఘటనా స్థలంలోనే చనిపోయారు. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడడంతో మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఒక మహిళ ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు మిర్యాలగూడ మండలం నందిపాడు గ్రామానికి చెందిన మహేష్ (35), జ్యోతి (30), మచ్చేందర్ (38), ఇషిక(8), లియాన్స్ (2)గా గుర్తించారు. విజయవాడలో కనుకదుర్గమ్మ దర్శించుకొని ఇంటికి వస్తుండగా  ఈ ప్రమాదం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News