మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పెన్షనర్ల నల్లగొండ జిల్లా కార్యవర్గ సమావేశం ఆ జిల్లా శాఖ అధ్యక్షులు జి. వెంకట్ రెడ్డి అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి. దామోదర్ రెడ్డి హాజరై పెన్షనర్ల ఉద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలపై మరీ ముఖ్యంగా రావలసిన రాయితీల గురించి వివరిస్తూ త్వరలోనే సానుకూల వాతావరణంలో ప్రభుత్వంతో చర్చలు జరిపి డిమాండ్లను సాధించుకుంటామన్నారు.
ముఖ్యంగా పెన్షనర్లకు హెల్త్ కార్డుల అమలు, రావలసిన 3డిఆర్‌లను, పిఆర్‌సి నివేదిక వచ్చుటకు ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యవర్గంలో సెక్రటరీ నివేదిక, కోశాధికారి నివేదికలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ కార్యక్రమంలో జెల్లా శ్రీశైలం, ఆర్. అమృతరెడ్డి, గాయం నారాయణ రెడ్డి ( బిల్డింగ్ ప్రెసిడెంట్), కె. రామలింగం, బి. మోహన్ రావు, కె. యుగంధర్ రెడ్డి, ఎస్.ఆంజనేయులు, కె.నారాయణరెడ్డి, బి. లింగయ్య, ఎండి హుస్సేన్, డి. పిచ్చిరెడ్డి, ఆర్. రాజలింగం, ఎం. సంతోష్‌రెడ్డి, కె.యాదగిరి గౌడ్, ఎం. వెంకట్ రెడ్డి, ఎం. శంకర్ రెడ్డి, జి. సత్యం, వై. వాసుదేవ్ అన్ని మండలాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామన్నపేట మండలం, కూరెళ్ల గ్రామానికి చెందిన పద్మ శ్రీ అవార్డు గ్రహీత కూరెళ్ల విఠళా చారిని ఘనంగా సన్మానించారు.