Monday, December 23, 2024

ప్రేమించాడు… పెళ్లి చేసుకున్నాడు… గర్భవతిని చంపేశాడు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రేమించాడు పెళ్లి చేసుకున్నాడు.. అనుమానంతో నిండు గర్భిణీ అని చూడకుండా ఆమె ప్రాణం ప్రేమికుడు తీసిన సంఘటన నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అజిలాపురం గ్రామానికి చెందిన శ్రీకాంత్(20), కమ్మగూడెం గ్రామానికి చెందిన సుష్మిత(18)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇరువురు కులాలు వేరుకావడంతో కుటుంబ సభ్యులను ఎదురించి జనవరి నెలలో పెళ్లి చేసుకున్నారు. నవ దంపతులు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ఆమె గర్భవతి కావడంతో అజిలాపురం గ్రామానికి భార్యను తీసుకెళ్లాడు. ఇద్దరు మధ్య గొడవలు జరగడంతో అదే రోజు తన భార్య అనుమానాస్పదంగా మృతి చెందింది.

Also Read: వైద్య విద్యలో నవశకం

వెంటనే ఆమె ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు పేర్కొన్నారు. తన సోదరి ఆరోగ్యంగా ఉండేదని ఆమె ఎలాంటి జబ్బులు లేవని మృతిపై అనుమానాలు ఉన్నాయని స్థానిక పోలీస్ స్టేషన్‌లో సుష్మిత చెల్లెలు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. ఆమె గాఢ నిద్రలో ఉన్నప్పుడు దిండుతో ముఖంపై అదిమిపెట్టి ఊపిరాడకుండా చేశానని విచారణలో నిందితుడు ఒప్పుకున్నాడు. వెంటనే అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని ఎస్‌ఐ రంగారెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News