Sunday, January 19, 2025

నార్కట్‌పల్లిలో లారీని ఢీకొట్టిన ఆర్‌టిసి బస్సు… ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎపి లింగోటం ఫ్లోఓవర్‌పై ఆగి ఉన్న లారీని ఆర్‌టిసి బస్సు ఢీకొట్టడంతో డ్రైవర్ మృతి చెందాడు. ఈ ప్రమాదంలో పది మంది నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News