Wednesday, January 22, 2025

నల్లగొండలో రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

నిడమనూరు: నల్గొండ జిల్లా నిడమనూరు మండలం వెంపాడ్ స్టేజీ వద్ద జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సోమవారం రాత్రి నడుచుకుంటూ వెళ్తున్న రమావత్ కేశవ్ (19)ను బైక్ తో నాగరాజు (28) ఢీ కొట్టడంతో ఇద్దరు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న రమావత్ కేశవులు కుటుంబ సభ్యులు టాటా ఏస్ లో బయలు దేరారు.

మార్గం మధ్యలో టాటాఎస్ ను ట్యాంకర్ ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతులు రమావత్ కేశవులు(19), రమావత్ గణ్య(40), నాగరాజు(28), రమావత్ పాండు (40), రమావత్ బుజ్జి(38)గా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పొగమంచు కారణంగా ప్రమాదంజరిగినట్లు అంచనాకు వచ్చారు. మృతులు నీమానాయక్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని మల్లెవాని కుంట తండాకు చెందినవారిగా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News