నల్లగొండ: ప్రభుత్వం ఉద్యోగం కోసం భర్తను భార్య చంపి అనంతరం అనారోగ్యంతో చనిపోయాడని నమ్మించిన సంఘటన నల్లగొండ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నల్లగొండ జిల్లా కేంద్రంలోని పాతబస్తీలో మహ్మద్ ఖలీల్(44), తన భార్య అక్సర్ జహ, తల్లి మహ్మద్ బేగం, కుమారుడితో కలిసి ఉంటున్నాడు. ఖలీల్ కనగల్ మండల పరిధిలోని చర్లగౌరారంలో పాఠశాలలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. జవనరి 25న అతడికి మూర్ఛ రావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు చనిపోయాడు.
అక్సర్ జహ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. తల్లి మహ్మద్ బేగం తన కుమారుడి మరణంపై అనుమానాలు ఉన్నాయని పోలీసులకు తెలిపింది. పోస్టుమార్టమ్‌లో బలమైన గాయంతో చనిపోయినట్ట తేలడంతో మహ్మద్ బేగంను అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించారు. వివాహం జరిగి 18సంవత్సరాలు అవుతుందని, ఖలీల్ మద్యానికి బానిసగా ప్రతీరోజు వేధిస్తున్నాడుని, వేధింపులు శృతి మించడంతో అడ్డు తొలిగించుకోవాలని నిర్ణయం తీసుకన్నాడు. అతడు చనిపోతే ప్రభుత్వం ఉద్యోగం తన కుమారుడికి వస్తుందని నమ్మకంతో అతడి తలపై సుత్తెతో బాదడంతో మృతి చెందాడని పోలీసులకు వివరించింది. పోలీసులు భార్యను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.