Thursday, January 23, 2025

తమిళనాడు సిఎస్‌గా నల్గొండ వాసి

- Advertisement -
- Advertisement -

తెలంగాణలోని నల్గొండ జిల్లా శాలిగౌరారం గ్రామానికి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి కుతాటి గోపాల్ తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శగా నియమితులయ్యారు. 1992 ఐఏఎస్ బ్యాచుకు చెందిన గోపాల్ మొదటి నుంచి తమిళనాడులోనే జాయింట్ కలెక్టర్ గా, కలెక్టర్ గా పలు కీలక పదవుల్లో విధులు నిర్వహించారు. మధ్యలో గుంటూరు జిల్లాలో టొబాకో బోర్డు చైర్మన్‌గా పనిచేశారు. స్టాలిన్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత నుండి పశుసంవర్ధక శాఖ, ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా ఉన్నారు. గోపాల్‌ మంగళవారం స్టాలిన్‌తో సమావేశమయ్యారు. పేద కుటుంబం నుంచి ఐఏఎస్‌ అయిన ఆయన సీఎస్‌ స్థాయికి ఎదగడంతో శాలిగౌరారం వాసులు అభినందనలు కురిపిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News