Thursday, January 23, 2025

భార్యతో చనువుగా ఉంటున్నాడని దాడి… చికిత్స పొందుతూ మృతి

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: తన భార్యతో చనువుగా ఉంటున్నావని ఓ వ్యక్తిపై దాడి చేయడంతో అతడు చికిత్స పొందుతూ చనిపోయిన సంఘటన నల్లగొండ జిల్లా త్రిపురారం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కొనతాలపల్లి గ్రామానికి చెందిన సైదులు ఓ ప్రైవేటు స్కూల్ బస్సుకు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. వెంగన్నగూడె గ్రామానికి చెంది శివ భార్యతో చనువుగా ఉండేవాడు. దీంతో శివ తన అనుచరులతో కలిసి సైదులుపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సైదులు మృతి చెందాడు. మృతదేహాన్ని శివ ఇంటి ముందు పెట్టి బంధువులు, స్థానికులు ఆందోళన చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అప్పటికే శివ కుటుంబ సభ్యులు ఇంట్లో నుంచి బయటకు పారిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News