Thursday, January 23, 2025

అమెరికాలో కారు ప్రమాదం: నల్గొండ యువకుడు మృతి

- Advertisement -
- Advertisement -

Nalgonda youth dies in road accident in US

వాషింగ్టన్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్గొండ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని క్రాంతి కిరణ్(24)గా గుర్తించారు. అతని  స్వస్థలం మిర్యాలగూడ మండలం అన్నారం. క్రాంతి కిరణ్ స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. క్రాంతి ఉన్నత చదువులకోసం అమెరికా వెళ్లి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్రాంతికిరణ్ మరణవార్త విన్న తల్లిదండ్రులు,బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News