Saturday, January 4, 2025

సిఎం ప్రస్తుతం మీరు చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతలు

- Advertisement -
- Advertisement -

పోలీసు ఉద్యోగం తప్ప వేరే ఉద్యోగానికి నేను సరిపోను
నాకు ఉద్యోగం ఇవ్వడానికి బదులుగా
నా ధర్మ ప్రచారానికి ఉపయోగ పడేలా ఏదైనా సాయం చేయండి
సిఎం రేవంత్ రెడ్డికి మాజీ డీఎస్పీ నళిని బహిరంగ లేఖ

మనతెలంగాణ/హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డికి మాజీ డీఎస్పీ నళిని ఫేస్‌బుక్‌లో బహిరంగ లేఖ రాశారు. సిఎం రేవంత్ రెడ్డి మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి నా కళ్లు చెమ్మగిల్లుతున్నాయి. మీ ఆత్మీయత నా హృదయానికి గొప్ప స్వాంతన కలిగించింది. ఈ నేపథ్యంలో గతం ఒక రీల్ లా నా కళ్ల ముందు కదులుతుంది. ఇన్నాళ్లు తాను ఒక సస్పెండ్ ఆఫీసర్‌గా ‘సోషల్ స్టిగ్మా ( మరక)’ను మోసానని ఆమె ఆ లేఖలో తెలిపారు. నన్ను ఆనాటి ప్రభుత్వం 3 ఏళ్లు చాలా ఇబ్బంది పెట్టిందని, ఒక్క మాటలో చెప్పాలంటే క్షణక్షణం ఒక గండంలా గడిచిందని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం మీరు చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతలని ఆమె తెలిపారు. పోలీసు ఉద్యోగం తప్ప వేరే ఉద్యోగానికి తాను సరిపోనన్నారు.

ఇక నాకు మీరు న్యాయం చేయాలంటే నాకు ఉద్యోగం ఇవ్వడానికి బదులుగా నా ధర్మ ప్రచారానికి ఉపయోగ పడేలా ఏదైనా సాయం చేస్తే స్వీకరిస్తానని ఆమె తెలిపారు. ఎందుకంటే మీరు రాజు, నేను బ్రాహ్మణిని. మీరు ఇచ్చే ప్రభుత్వ ఫండ్ ను నేను స్వతంత్రంగా ఉంటూనే ఒక వేద, యజ్ఞ ,సంస్కృత సంబంధ ధార్మిక కేంద్ర ఏర్పాటుకు వినియోగిస్తాను. ( నేను మిమ్మల్ని కలవాలి. కానీ, ప్రస్తుతం సనాతన ధర్మానికి మూలాలైన ‘వేదం యజ్ఞం’ అనే పుస్తకాన్ని తెలుగు, హిందీ భాషల్లో రాస్తున్నాను. హిందీ ప్రూఫ్ చూసే పనిలో బిజీ గా ఉన్నాను. మహర్షి 200 వ జయంతి వరకు అది సిద్ధం కావాలి. సమయం ఎక్కువగా లేదు. అందుకే అది అయిపోగానే దాని ప్రింటింగ్‌కు ఇచ్చేసి వచ్చి మిమ్మల్ని కలుస్తాను. అందుకే ఇలా నా ఫేస్‌బుక్‌లో బహిరంగ లేఖ రాయాల్సి వచ్చింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News