Tuesday, December 24, 2024

ప్రభుత్వ ఖర్చులతో నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయనిర్మాణం

- Advertisement -
- Advertisement -

ఇప్పటికే పూర్తయిన భూమిపూజ
6 నెలల్లో పనులు పూర్తి. వచ్చే దసరాకల్లా నల్లపోచమ్మ విగ్రహ పున: ప్రతిష్ట
పాత సచివాలయ ప్రాంగణంలో గతంలో కొలువుదీరిన ఆంజనేయ స్వామి, శివలింగాలను సైతం పున: ప్రతిష్టించనున్న ప్రభుత్వం భవనాల కూల్చివేత కు ప్రాయస్చితంగా అన్ని మతాల వారి ప్రార్థనా మందిరాలకూ పనులు ముమ్మరం.

Nalla Pochamma Ammavari Temple construction
మన తెలంగాణ/హైదరాబాద్: కొత్తగా నిర్మితమవుతున్న సచివాలయం ప్రాంగణంలో గతానికి దీటుగా ప్రార్థనా మందిరాలను పునఃనిర్మిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదివరకే ప్రకటించారు. అందుకు సంబంధించి పనులను అధికారులు ముమ్మరం చేశారు. ఇప్పటికూ భూమి పూజ కూడా పూర్తయింది. పాత సెక్రటేరియట్లో కేవలం 200 ల గజాల్లో మాత్రమే నల్లపోచమ్మ దేవాలయం ఉండేదనీ, కొత్త దేవాలయం కోసం 2200 ల చదరపు గజాల్లో నిర్మాణం జరగనుందని అధికారులు తెలిపారు. వాస్తుశాస్త్రానికి అనుగుణంగా నిర్మితమవుతున్న ఈ దేవాలయంలో గతంలోలాగే ఇప్పుడు కూడా అమ్మవారు తూర్పుకు అభిముఖంగా కొలువుదీరనున్నారు. ఆలయానికి అమృతాకాజిల్ రోడ్డువైపు ఒకటి, కొత్త సెక్రటేరియట్ లోపలివైపు మరొకటి మొత్తం రెండు ఎంట్రీలు ఉండనున్నాయి. అనగా తెలుగుతల్లి ఫ్లై ఓవర్ వైపు ఒక సింహ ద్వారం, సమీకృతం కానున్న కొత్త సచివాలయం లోపలి వైపు మరొక ముఖ ద్వారం నిర్మించబడతాయి. అంతే కాకుండా ఒకే ప్రాంగణంలో విసిరేసినట్లు ఉన్న వివిధ భవనాల సముదాయాన్ని కూల్చివేసి అక్కడ అధునాతన హంగులు, సౌకర్యాలతో ఒకే భవన సముదాయంగా నూతన సచివాలయాన్ని ప్రభుత్వం నిర్మిస్తుంది.

ఆలయాల పునః నిర్మాణం శుభసూచికం:

పాత భవనాల కూల్చివేత సమయంలో ప్రార్థనా మందిరాలు దెబ్బతిన్నాయి. అశుభం జరగకుండా విడుపు మంత్రంతో దేవతా మూర్తులను శాస్త్రోక్తంగా ఉన్న చోటునుంచి తరలించి, అందుకు బదులుగా అన్ని వర్గాల పూజా మందిరాలను గతంకంటే దీటుగా పూర్తి ప్రభుత్వ ఖర్చులతో కట్టిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇవ్వడం శుభానుసూచికం. ఆమేరకు సర్వమతాల ప్రజలకూ అనుకూలంగా ఉండేలా కొద్దిరోజుల క్రితం మసీదు, చర్చి నిర్మాణ పనులు మొదలయ్యాయి. పాత సచివాలయంలో గతంలో కొలువుదీరిన మహాశివుడు, ఆంజనేయస్వామి తదితర అన్ని దేవతామూర్తుల పున:ప్రతిష్ట శాస్త్రోక్తంగా చేయాలనేది ప్రభుత్వ వారి నిర్ణయం. ఒక్కో మందిరానికి కోటి చొప్పున ప్రాథమిక అంచనాలతో నిర్మాణ పనులు మొదలుపెడుతున్నా, అవసరాన్ని బట్టి, దేవాదాయశాఖ, వక్ఫ్ బోర్డుల నుంచి మరిన్ని నిధులు కేటాయించి రాజీపడకుండా వాటికి సర్వ సౌకర్యాలూ ప్రభుత్వం సమకూర్చనుంది. శరవూగంగా జరుగుతున్న నల్లపోచమ్మ దేవాలయ నిర్మాణం ఆరునెలల్లోపు పూర్తయ్యేలా పనులు కొనసాగనున్నాయి. పోచమ్మ విగ్రహానికి పున:ప్రతిష్టను ఘనంగా జరిపి వచ్చే దసరాకు సమీకృతమైన కొత్త సచివాలయంతో పాటుగా ఆలయాన్ని ప్రారంభిస్తామని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News