- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయ ప్రతిష్టాపన మహోత్సవం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు శాస్త్రోక్తంగా జరిగే ఈ పూజా కార్యక్రమాలు బుధవారం ఉదయం గణపతి పూజతో ప్రారంభమయ్యాయి. పుణ్యహ వాచనం, యాగశాల శుద్ధి, గోపూజ, ఆవాహిత గణపతి హోమం నిర్వహించారు. సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు మొదటి రోజు గణపతి పూజా కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు.
24వ తేదీన ఉదయం 9 గంటలకు స్థాపిత పూజ, ప్రతిష్ఠాపన హోమం, మహాస్నపనం, వేద పారాయణం, మహాలక్ష్మీయాగం, సాయంత్రం శయ్యాదివాసం, ఫల పుష్పదివాసం, మహా మంగళహారతి కార్యక్రమాలను చేపడుతారు. 25వ తేదీన ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు చండీయాగం తదితర పూజా కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.
- Advertisement -