Thursday, November 14, 2024

బిజెపి కార్యవర్గంలో నల్లమల ప్రాంతానికి పెద్దపీట

- Advertisement -
- Advertisement -

అచ్చంపేట : రాష్ట్రంలో బిజెపి పార్టీ నూతనంగా ఎన్నుకున్న కార్యవర్గంలో అచ్చంపేట నల్లమల ప్రాంతానికి చెందిన ఇద్దరికి రాష్ట్ర కార్యవర్గంలో సముచిత స్థానం కల్పించి బిజెపి పార్టీ నల్లమల ప్రాంతానికి పెద్దపీట వేసిందని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సతీష్ మాదిగ అన్నారు. బుధవారం అచ్చంపేట పట్టణంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో విలే కరుల సమావేశంలో నూతనంగా ఎన్నికైన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సతీష్ మాదిగ, మంగ్యా నాయక్ అచ్చంపేట ప్రాంతానికి చెందిన ఎస్సి, ఎస్టి సా మాజిక వర్గానికి చెందిన వారిని రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకోవడం అభినందనీయమని, తద్వారా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్‌కు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా సతీష్ మాదిగ మాట్లాడుతూ నల్లమల ప్రాంతంలో కేంద్ర మంత్రి డాక్టర్ మహేంద్ర నాథ్ పాండే బౌరాపూర్ చెంచుపెంట పర్యటనలో భాగంగా విస్తారంగా ఉన్న నల్లమల ప్రాంతంలో వనమూలికలు పుష్కలంగా ఉన్నాయని తద్వారా ఈ ప్రాంతంలో ఆయుర్వేదిక్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రికి వినతిపత్రం ఇవ్వగా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందిస్తూ సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి ఈ ప్రాంతంలో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేసే విధంగా ప్రయత్నాలు కొనసాగిస్తామని కేంద్రం మంత్రి రిప్లై లెటర్ తమకు అందిందన్నారు.

అదే విధంగా గతంలో వైద్యం అభివృద్ధిలో అందుబాటులో లేనప్పుడు ఈ నల్లమల ప్రాంతంలో ఉమామహేశ్వర క్షేత్రంతో పాటు దట్టమైన అడవుల్లో ఋషులు, యోగులు ప్రాణాంతకరమైన వ్యాధులకు కూడా వనమూలికలతో ప్రజలకు వైద్యం చేసి ప్రాణాలు కాపాడారని ఆయన గుర్తు చేశారు. కాగా వనమూలికలు ఉన్న ఈ ప్రాంతంలో మెడిసిన్ కంపెనీలు ఏర్పాటు చేస్తే యువకులకు జీవన ఉపాధి కలుగుతుందన్నారు.

గతంలో పాలకులు ఈ ప్రాంతంలో కాగితాల పరిశ్రమతో పాటు బొంగు పుష్కలంగా ఉన్న ప్రాంతంలో తూనిక ఆకుతో బిడీల పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెప్పిన హామి నేటికి కూడా హామీలకే పరిమితమయ్యాయని సతీష్ మాదిగ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బిజెపి పార్టీ డబుల్ ఇంజన్ సర్కార్‌తోనే సాధ్యమని సతీష్ మాదిగ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆసుపత్రులు ప్రజల ప్రాణాలు కాపాడే విధంగా లేవని, కేవలం క్షతగాత్రులకు రెఫర్ చేసే విధంగా ఆసుపత్రులు తయారయ్యాయని సతీష్ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. అంతకు ముందు అంబేద్కర్ కూడలి వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి పార్టీ శ్రేణులతో కలిసి టపాసులు కాల్చి హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News