Monday, December 23, 2024

‘నల్లమల’ పెద్ద సక్సెస్ కావాలి

- Advertisement -
- Advertisement -

Nallamala movie trailer released

 

అమిత్ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘నల్లమల’. ఈ చిత్రం ద్వారా రవిచరణ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ముఖ్య అతిథిగా పాల్గొని ట్రైలర్‌ను విడుదల చేశారు. అనంతరం దిల్ రాజు మాట్లాడుతూ.. “నల్లమల సినిమా అనగానే… ఏమున్నవే పిల్లా అనే సాంగ్ గుర్తొచ్చింది. ఈ సాంగ్ అంత పెద్ద హిట్ అయిందంటే సినిమాలో, దర్శకుడిలో ఏదో ఉందని అర్థమైంది. కొత్త వాళ్లంతా కలిసి చేస్తున్న ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి” అని అన్నారు. దర్శకుడు రవిచరణ్ మాట్లాడుతూ.. “ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. పాట విడుదలైన రోజు నుంచి ప్రతి ఒక్కరూ మెచ్చుకున్నారు” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమిత్ తివారి, భానుశ్రీ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News