Thursday, January 23, 2025

త్రిపుర గవర్నర్‌గా నల్లు ఇంద్రసేనా రెడ్డి బాధ్యతలు స్వీకరణ

- Advertisement -
- Advertisement -

స్వాగతం పలికిన సిఎం డా. మాణిక్ సాహు, మంత్రులు

మన తెలంగాణ/ హైదరాబాద్: త్రిపుర గవర్నర్‌గా నల్లు ఇంద్రసేనా రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించారు. గురువారం అగర్తలాలో త్రిపుర హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేశ్ కుమార్ సింగ్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నూతన గవర్నర్‌కు సాయుధ దళాలు గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహించాయి. ఈ సందర్భంగా ప్రముఖులను ముఖ్యమంత్రి కొత్త గవర్నర్ కు పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని కార్యాలయ అధికారులు, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ అధికారులు పాల్గొన్నారు.

గవర్నర్ దంపతులు బుధవారం అగర్తలా చేరుకోగానే వారిని ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహ, అతని మంత్రివర్గ సహచరులు , ఎమ్మెల్యేలు , ఎంపీలు, సీనియర్ ఐఏఎస్ , ఐపీఎస్ అధికారులు విమానాశ్రమయంలో ఘన స్వాగతం పలికారు. అక్కడ కొత్త గవర్నర్‌కు గార్డు -ఆఫ్ -హానర్ నిర్వహించారు. అనంతరం తన నియామకంపై రాష్ట్రపతికి , ప్రధానికి, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు నల్లు ఇంద్రసేనా రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. విమానాశ్రయం నుండి గవర్నర్ దంపతులు రాజ్ భవన్‌కు చేరుకుని గురువారం ఉదయం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం చేశారు. అనంతరం రాజభవన్‌లో ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహ, సీనియర్ అధికారులతో నల్లు ఇంద్రసేనా రెడ్డి సమావేశమయ్యారు.

రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ పథకాలు , కార్యక్రమాలను వివరించారు. ఈసందర్భంగా గవర్నర్ నల్లు ఇంద్రసేనా రెడ్డి మాట్లాడుతూ అధికారులు పారదర్శకత , జవాబుదారీతనం పాటించాలని , సాధారణ పౌరులు సైతం సాధికారత సాధించేలా అంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం అనేకమంది ప్రజా ప్రతినిధులు, నాయకులు గవర్నర్ కు అభినందనలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన అభిమానులు పూల దండలతో సత్కరించారు . రాజభవన్ లో గవర్నర్ దంపతులు ఎట్ – హోం హై- టీ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిఎ మాణిక్ సాహతో పాటు, మంత్రులు, అధికారులు, న్యాయమూర్తులు హాజరయ్యారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News