Tuesday, January 28, 2025

అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలి: నామా

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: మోడీ ప్రభుత్వం గత తొమ్మిదేళ్ల నుంచి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని బిఆర్‌ఎస్ ఎంపి నామా నాగేశ్వర్ రావు మండిపడ్డారు. లోక్ సభలో నామా నాగేశ్వర్ రావు మీడియాతో మాట్లాడారు. ఖమ్మం జిల్లాకు సంబంధించిన తొమ్మిది మండలాలను అన్యాయంగా లాక్కున్నారని, కాజీపేటకు రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్‌కు మోడీ తీసుకెళ్లారని ధ్వజమెత్తారు. ఇప్పటి వరకు తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదని, విభజన చట్టంలోని ఒక్క హామీని మోడీ నెరవేర్చలేదని, కెసిఆర్ ప్రభుత్వం ఎన్నిసార్లు లేఖలు రాసిన ఒక్క నవోదయ పాఠశాల కేటాయించలేదని, అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

Also Read: స్మృతీ ఇరానీకి రాహుల్ ఫ్లయింగ్ కిస్?

తెలంగాణ పథకాలను కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాలు కాపీ కొట్టాయని, మిషన్ భగీరథకు కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, మన ఐటిఐఆర్ ప్రాజెక్టును గుజరాత్‌కు తరలించుకపోతున్నారన్నారు. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందని నామా ప్రశంసించారు. కేంద్రం ప్రజా వ్యతిరేక నిర్ణయాల వల్ల సామాన్యులపై ఆర్థిక భారం పడుతోందని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను విపరీతంగా మోడీ ప్రభుత్వం పెంచుతోందని నామా మండిపడ్డారు. ఇంటింటికి నల్లా నీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, సాగుకు 24 గంటల ఉచిత్ విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. తెలంగాణ తరహాలో దేశమంతా రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News